గాజాను తిరిగి స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్.. 3 వేలు దాటిన మృతుల సంఖ్య
- హమాస్‌పై భీకరదాడులకు దిగిన ఇజ్రాయెల్ సైన్యం
- గాజాపై రాతంత్రా బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు
- గాజాలో నిరాశ్రయులైన 1.80 లక్షల మంది
ఇజ్రాయెల్ సైన్యం, వారి ఫైటర్ జెట్లు గాజాలోని 200కుపైగా లక్ష్యాలపై రాత్రంతా బాంబుల వర్షం కురిపించాయి. హమాస్ ఉగ్రవాదుల కేంద్రాలు సహా పలు భవనాలను నేలమట్టం చేశాయి. ఇజ్రాయెల్ దళాలు కూల్చివేసిన ఇళ్లలో గాజాలోని హమాస్ సాయుధ విభాగం నాయకుడు మహ్మద్ దీప్ తండ్రి ఇల్లు కూడా ఉన్నట్టు పాలస్తీన్ మీడియా తెలిపింది. ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం గాజాలో 1.80 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.