Mia Khalifa: హమాస్ మిలిటెంట్లకు మద్దతుగా మియా ఖలీఫా వివాదాస్పద ట్వీట్.. నెట్టింట దుమారం

Mia Khalifas Post On Attacks In Israel Costs Business Deal
  • మిలిటెంట్లను స్వాతంత్ర్య సమరయోధులుగా సంబోధించిన మాజీ పోర్న్ స్టార్
  • ఇజ్రాయెల్ పై చేసిన దాడులకు సంబంధించిన వీడియోల్లో క్లారిటీ లేదంటూ ట్వీట్
  • మియా ఖలీఫాతో అగ్రిమెంట్లు రద్దు చేసుకుంటున్న పలు కంపెనీలు
మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా తాజాగా వివాదంలో చిక్కుకుంది. సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్ట్ లపై ప్రస్తుతం దుమారం రేగుతోంది. దీంతో మియా ఖలీఫాతో ఇప్పటికే కుదుర్చుకున్న అగ్రిమెంట్ ను రద్దు చేసుకుంటున్నట్లు ప్లే బాయ్ కంపెనీ ప్రకటించింది. మరో కంపెనీ టోడ్ షపిరో కూడా ఇదే తరహా ప్రకటన చేసింది. నెటిజన్లు కూడా మియా ఖలీఫా తీరును తప్పుబడుతున్నారు. ఓవైపు జనం చనిపోతుంటే.. గాయాల పాలై ఆర్తనాదాలు చేస్తుంటే ఇలాంటి ట్వీట్ చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ మియా ఖలీఫా ఏమన్నదంటే..
ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధంపై మియా ఖలీఫా స్పందిస్తూ.. ‘ఇజ్రాయెల్ లో జరుగుతున్న దాడులకు సంబంధించిన వీడియోలు సరిగా కనిపించడంలేదు. వీడియోలు తీసేటపుడు ఫోన్లను నిలువుగా కాకుండా అడ్డంగా పట్టుకొమ్మని పాలస్తీనా ఫ్రీడం ఫైటర్లకు చెప్పండి.. ప్లీజ్’ అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ వైరల్ కావడంతో ప్రముఖ కంపెనీ ప్లేబాయ్ ఓ ప్రకటన విడుదల చేసింది. మియా ఖలీఫాతో అగ్రిమెంట్ ను రద్దు చేసుకుంటున్నట్లు తెలిపింది. ఈ మాజీ పోర్న్ స్టార్ తో అగ్రిమెంట్ కోసం చర్చలు జరుపుతున్న టోడ్ షపిరో కంపెనీ ప్రతినిధి స్పందిస్తూ.. మీ ట్వీట్ నిజంగా భయంకరంగా ఉంది.. మీరు మానవత్వం ఉన్న మనిషిగా ఎదగాలని మా కంపెనీ తరఫున కోరుకుంటున్నాం. ఇలాంటి విషాదకరమైన పరిస్థితిలో నిర్లక్ష్యపూరితమైన ట్వీట్ చేయడం మీకే చెల్లిందంటూ ట్వీట్ చేశారు. మియా ఖలీఫాతో ఇకపై ఎలాంటి అగ్రిమెంట్ కుదుర్చుకోబోమని స్పష్టం చేశారు.

దీటుగా బదులిచ్చిన ఖలీఫా..
పాలస్తీనాకు సపోర్ట్ చేయడం వల్ల బిజినెస్ పరంగా నష్టపోవడం కన్నా ఇలాంటి కంపెనీలతో నేను ఇంతకాలం పనిచేశాననే బాధే ఎక్కువగా ఉందని మియా ఖలీఫా వ్యాఖ్యానించింది. తాను లెబనాన్ లో పుట్టి పెరిగానని, స్వాతంత్ర్యం కోసం పడే తపన ఎలా ఉంటుందో తనకు తెలుసని చెప్పింది. పాలస్తీనా పౌరులు నిజంగానే స్వాతంత్ర్య సమరయోధులని, ఆ మాటకు తాను ఎప్పటికీ కట్టుబడి ఉంటానని పేర్కొంది. పాలస్తీనాలో పుట్టిపెరుగుతున్న వారంతా స్వాతంత్ర్యం కోసం నిత్యం పోరాడుతున్నారని స్పష్టం చేసింది. 
Mia Khalifa
Israel gaza war
palestine
Hamas
Twitter
Ex porn star

More Telugu News