యుద్ధాన్ని మేం మొదలు పెట్టలేదు కానీ, ముగించేది మేమే: ఇజ్రాయెల్ ప్రధాని
- దేశప్రజలను ఉద్దేశించి ఇజ్రాయెల్ ప్రధాని ప్రసంగం
- హమాస్ చారిత్రక తప్పిదం చేసిందని వ్యాఖ్య
- ఇజ్రాయెల్ ప్రతిదాడి శత్రుదేశాలకు దశాబ్దాల పాటు గుర్తుండిపోతుందని హెచ్చరిక
- అమెరికా అధ్యక్షుడికి కృతజ్ఞతలు
హమాస్ కూడా ఐసిస్ లాంటి ఉగ్ర సంస్థేనని నేతన్యాహు పేర్కొన్నారు. ప్రజలంతా కలిసికట్టుగా దాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. హింస, అనాగరికతకు వ్యతిరేకంగా పోరాడే ప్రతి దేశం తరపునా ఇజ్రాయెల్ ఈ యుద్ధం చేస్తోందని చెప్పారు. కాగా, తమకు మద్దతు తెలిపిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు నేతన్యాహు కృతజ్ఞతలు తెలిపారు.