ప్రేమతోనే అలా చేశా, మరో ఉద్దేశం లేదు: హోం మంత్రి మహమూద్ అలీ
- గన్‌మెన్ చెంప ఛెళ్లుమనిపించడంపై హోం మంత్రి వివరణ
- గన్‌మెన్ తన కొడుకు లాంటి వాడని వ్యాఖ్య
- అతడి విషయంలో తనకు మరో ఉద్దేశం లేని స్పష్టీకరణ
- తాను అందరినీ గౌరవించే వ్యక్తినని వివరణ
ఇటీవల మలక్‌పేటలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో సీఎం బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హోం మంత్రి సహా పలువురు తెలంగాణ మంత్రులు హాజరయ్యారు. అయితే ఆ రోజు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదినం కావడంతో హోం మంత్రి మహమూద్ అలీ ఆయనను ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో పూల బొకే కోసం సిబ్బంది వైపు తిరగ్గా తమకు ఈ విషయం గురించి తెలియదని వారు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన మహమూద్ అలీ ఓ గన్‌మెన్ చెంప ఛెళ్లుమనిపించారు. ఘటనకు సంబంధించి వీడియో వైరల్ కావడంతో ఇది వివాదానికి దారి తీసింది.