ఓపెనింగ్ సెర్మనీ లేకుండానే వరల్డ్ కప్ ప్రారంభం.. నేటి మధ్యాహ్నమే తొలి మ్యాచ్
- అహ్మదాబాద్ లో ఇంగ్లాండ్- న్యూజిలాండ్ మధ్య ఫస్ట్ మ్యాచ్
- మధ్యాహ్నం 2 గంటలకు నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభం
- కెప్టెన్స్ డే పేరుతో ఈవెంట్ నిర్వహించిన బీసీసీఐ
ఇందులో అన్ని జట్ల కెప్టెన్లతో ముఖాముఖి తరహాలో కార్యక్రమం నిర్వహించిందని టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనం ప్రచురించింది. కాగా, గడిచిన మూడు టోర్నీలలో ఆతిథ్య దేశమే ప్రపంచకప్ ను సొంతం చేసుకుందని, ఈసారి కూడా ఈ ఆనవాయితీ కొనసాగుతుందని భావిస్తున్నారా అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. ఆ విషయంపై ఎక్కువగా ఆలోచించడంలేదని చెప్పారు. అయితే, ఈ టోర్నీలో కప్పు గెలుచుకోవడానికి తమ జట్టు శక్తిసామర్థ్యాలన్నీ ఉపయోగించుకుంటామని పేర్కొన్నారు.