‘లివింగ్ స్టాట్యూ’ గిర్జేష్ గౌడ్‌పై కానిస్టేబుల్ దాష్టీకం.. పీకనొక్కుతూ ఈడ్చుకెళ్లే ప్రయత్నం!
- లివింగ్ స్ట్యాట్యూ, గోల్డ్‌మ్యాన్‌గా ముంబై వాసులకు చిరపరిచితుడైన గిర్జేష్ గౌడ్
- బాంద్రా బండ్స్టాండ్లో గిర్జేష్తో గొడవపడిన కానిస్టేబుల్
- జనం అడ్డుకున్నా తోసుకుంటూ ఈడ్చుకెళ్లిన వైనం
- కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాల్సిందేనంటున్న నెటిజన్లు
తనపై జరిగిన దాడి విషయాన్ని గిర్జేష్ తన ఇన్‌స్టా ఖాతా ’గోల్డీస్టాట్యూ’లో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. కానిస్టేబుల్ ఆ సమయంలో తాగి ఉన్నట్టు కూడా ఆరోపణలున్నాయి. మద్యం మత్తులోనే అతడలా చేశాడా? అన్నది దర్యాప్తులో తేలనుంది. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు గోల్డ్‌మ్యాన్ పేర్కొన్నాడు.
మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ తొలుత తనపై కర్రతో దాడిచేశాడని, తాను ఆపేందుకు ప్రయత్నిస్తే పీకనొక్కుతూ లాక్కెళ్లాడని పేర్కొన్నాడు. తనను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కేసు పెడతానని కూడా తనను బెదిరించాడని ఆరోపించాడు. తానో ఆర్టిస్టునని, ఈ వీడియోను వీలైనంత మందికి షేర్ చేసి అందరి దృష్టికి తీసుకెళ్లాలని కోరాడు. ముంబై పోలీసులు, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులను ట్యాగ్ చేశాడు. వీడియోను చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ గొప్ప ఆర్టిస్టుపై కానిస్టేబుల్ ఇలా ప్రవర్తించడం సరికాదని, అతడిపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి