చంద్రబాబును ఇంకా అభిమానిస్తున్న వాళ్లను ఎడ్యుకేట్ చేయాలి: మంత్రి ధర్మాన
- శ్రీకాకుళంలో ఫిష్ ఆంధ్రా స్టాల్ ప్రారంభోత్సవం
- హాజరైన మంత్రి ధర్మాన
- ఎన్టీఆర్ ను అభిమానించే మత్స్యకారులు చంద్రబాబుకు మద్దతివ్వడమేంటని వ్యాఖ్యలు
నాడు ఎన్టీఆర్ పరిస్థితి గురించి ఎంతో బాధపడిన మత్స్యకారులు ఇంకా చంద్రబాబుకు మద్దతిస్తున్నారని, మత్స్యకార గ్రామాల్లోనే ఇలాంటి పరిస్థితి కనిపిస్తోందని వెల్లడించారు.
"నాడు ఎన్టీఆర్ ను హింసించి, అవమానించారు... అలా హింసించి, అవమానించడానికి కారకులు ఎవరో మీరు చూసుంటారు. ఇలాంటివన్నీ మత్స్యకారులకు వివరిస్తుండాలి" అంటూ పార్టీ శ్రేణులకు బోధించారు.