బాబోయ్! ఎంతపెద్ద తిమింగలమో.. కేరళ తీరానికి కొట్టుకొచ్చిన కళేబరం.. పేలిపోయే ప్రమాదం!
- కోజికోడ్ తీరానికి కొట్టుకొచ్చిన కళేబరం
- దాని పొడవు 50 అడుగుల పైనే
- చూసేందుకు ఎగబడుతున్న జనం
- దగ్గరికి వెళ్లొద్దంటూ హెచ్చరికలు
తీరానికి కొట్టుకొచ్చిన బ్లూ వేల్ కళేబరానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో దానిని చూసేందుకు జనం పోటెత్తారు. నిజాముద్దీన్ అనే యూజర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. దయచేసి ఎవరూ ఆ కళేబరం వద్దకు వెళ్లొద్దని, అది పేలిపోయి గాయాలపాలయ్యే అవకాశం ఉందని హెచ్చరించాడు.
సాధారణంగా పెద్ద తిమింగలాల కళేబరాల్లో వాయువులు ఏర్పడి ఒక్కోసారి పేలిపోతుంటాయి. అవి కొన్నిసార్లు నెమ్మదిగా విడుదలవుతాయి. మరికొన్ని సందర్భాల్లో మాత్రం భారీ పేలుడుతో బయటకు వచ్చేస్తాయి. గతంలో ఇలాంటి ఘటలు చాలానే జరిగాయి. ఈ నేపథ్యంలో ఇన్‌స్టా యూజర్ ఈ హెచ్చరిక చేశాడు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి