గుమస్తా స్థాయి లేని వారు గ్రూప్ 1 ఉద్యోగులను ఎలా నిర్ధారిస్తారు?: రేవంత్ రెడ్డి
- దళారులతో టీఎస్పీఎస్సీని నింపేశారంటూ సీఎం కేసీఆర్ పై మండిపడ్డ టీపీసీసీ చీఫ్
- ఉన్నత విద్యావంతులు ఉండాల్సిన బోర్డులో ఇలాంటి వాళ్లను నియమించారని ఫైర్
- రాజ్యాంగబద్ద సంస్థను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారని ఆరోపణ
- నిరుద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశంలో రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
నిరుద్యోగులు, మేధావులు ఆందోళనలు వ్యక్తం చేసినా సరే ప్రభుత్వం పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయ అవసరాల కోసం గుమస్తా హోదా కూడా లేనివారిని ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టిందని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంగా గ్రూప్ 1 రాసిన నిరుద్యోగులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారని చెప్పారు. గ్రూప్ 1 పరీక్ష రెండుసార్లు రద్దయిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. బోర్డులో అనర్హులు ఉండడం వల్ల టీఎస్పీఎస్సీ ఒక్క పరీక్షనూ సక్రమంగా నిర్వహించలేకపోతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.