నిజ్జర్ హత్యలో పాక్ ఐఎస్ఐ హస్తం!
- ఐఎస్ఐకి అనుకూలంగా వ్యవహరించని నిజ్జర్
- కిరాయి నేరస్థులతో హత్యకు పథకం పన్నిన ఐఎస్ఐ
- ఆ మరక భారత్ పై పడేలా పాక్ గూఢచర్య సంస్థ కుట్ర
నిజ్జర్ ను అడ్డు తొలగించడం వల్ల ఆ స్థానంలో మరో వ్యక్తిని కూర్చోబెట్టి, తాము చెప్పినట్టు ఆడించొచ్చన్నది ఐఎస్ఐ వ్యూహం. ఇప్పుడు నిజ్జర్ స్థానంలో మరో నేతను తెరపైకి తీసుకొచ్చేందుకు ఐఎస్ఐ ఏజెంట్లు కెనడాలో ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాదులు అందరినీ ఒక్కటి చేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. అయితే, నిజ్జర్ హత్యోదంతంలో భారత్ ప్రభుత్వం ప్రమేయం ఉందన్న దానికి ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయని కెనడా ప్రధాని ట్రూడో స్వయంగా ప్రకటించడం గమనార్హం. ఈ కేసులో నిజమైన దర్యాప్తు జరిగితే కానీ, అసలు నిజం బయటకు రాదు.