డైరెక్టర్ అట్లీపై నయనతార అసహనం.. షారుక్ ఖాన్ స్పందన ఇదే!
- ఘన విజయం సాధించిన షారుక్, నయనతార చిత్రం 'జవాన్'
- సినిమాలో తన పాత్రను తక్కువగా చూపించారని నయన్ అసంతృప్తి
- నయన్ పాత్ర చాలా గొప్పగా ఉందన్న షారుక్
తాజాగా ఇదే అంశంపై షారుక్ స్పందించారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా 'ఆస్క్ మీ ఎనీథింగ్' కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా నయనతార అంశాన్ని ఒక నెటిజన్ ప్రస్తావించాడు. దీనికి షారుఖ్ సమాధానమిస్తూ... ఈ చిత్రంలో నయనతార పోషించిన సింగిల్ మదర్ క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉందని కితాబునిచ్చారు. అయితే నయనతారకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ లేకపోయిందని అయినప్పటికీ ఆమె పాత్ర చాలా గొప్పగా ఉందని అన్నారు.