అసెంబ్లీలో చంద్రబాబు సీటుపైకి ఎక్కి విజిల్ ఊదిన బాలయ్య.. అంబటి రాంబాబు సెటైర్లు

22-09-2023 Fri 10:28 | Andhra
Advertisement
  • చంద్రబాబు జైలుకు వెళ్లిన తర్వాత పొలిటికల్ గా దూకుడుగా వ్యవహరిస్తున్న బాలయ్య
  • అసెంబ్లీలో విజిల్ ఊదుతూ ప్రభుత్వంపై నిరసన
  • ఎన్నికల తర్వాత ఇంటికి వెళ్లి విజిల్ ఊదుకోవాల్సిందేనన్న అంబటి
Advertisement
టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రిమాండ్ కు వెళ్లిన తర్వాత... ఆ పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ పొలిటికల్ గా ఫుల్ యాక్టివ్ అయ్యారు. పార్టీని ముందుండి నడిపించే బాధ్యతలను ఆయన భుజానికెత్తుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో సైతం ఆయన గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ సభ్యులతో కలిసి ఆయన స్పీకర్ పోడియంలోకి వెళ్తున్నారు. 

నిన్నటి సమావేశాల్లో 'దమ్ముంటే రా అంబటీ... చూసుకుందాం' అని బాలయ్య సవాల్ విసిరారు. ఈరోజు సభలో చంద్రబాబు సీటుపైకి ఎక్కి విజిల్ ఊదారు. విజిల్ ఊదుతూ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు విజిల్ ఊదిన బాలయ్యపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. చంద్రబాబు సీటుపైకి ఎక్కడం ఎందుకు, ఆ సీట్లో కూర్చోవాలని అన్నారు. తండ్రిని చంపిన బావ కళ్లలో ఆనందం చూసేందుకు బాలకృష్ణ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల తర్వాత ఇంటికి వెళ్లి విజిల్ ఊదుకోవాల్సిందేనని చెప్పారు. 

మరోవైపు, చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని తిరస్కరించారు. దీంతో, టీడీపీ సభ్యులు తన నిరసనను మరింత తీవ్రతరం చేశారు. ఇంకోవైపు, శాసనమండలిలో సైతం టీడీపీ సభ్యులు ఆందోళనను కొనసాగిస్తున్నారు.
Advertisement
Ambati Vs BalakrishnaAP Assembly SessionAmbati RambabuYSRCPBalakrishnaChandrababuTelugudesamWhistle

More Telugu News

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12
..more