కేరళ దాటిన నీపా వైరస్.. పశ్చిమ బెంగాల్‌లోకి ఎంట్రీ?
- కేరళ నుంచి సొంతూరికి తిరిగొచ్చిన పశ్చిమబెంగాల్ యువకుడిలో నిపా వైరస్ లక్షణాలు
- నీపా వైరస్ టెస్టులు ఇంకా జరపాల్సి ఉందని చెప్పిన యువకుడి కుటుంబసభ్యులు
- కేరళలో ఉండగానే తీవ్ర జ్వరంతో ఆసుపత్రి పాలైన యువకుడు
- జ్వరం తగ్గాక డిశ్చార్జ్, సొంతరాష్ట్రం చేరుకున్న రెండు రోజులకే తిరగబెట్టిన అనారోగ్యం
కేరళలో ఉండగానే అతడు తీవ్ర జ్వరంతో బాధపడ్డాడని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. స్థానిక ఆసుపత్రిలో కొంత కాలం చికిత్స తరువాత యువకుడికి జ్వరం తగ్గడంతో డిశ్చార్జ్ అయినట్టు పేర్కొన్నారు. ఆ తరువాత పశ్చిమ బెంగాల్‌కు తిరిగొచ్చిన రెండు రోజులకే బాధితుడు అనారోగ్యం పాలయ్యాడని చెప్పారు. తొలుత అతడిని నేషనల్ మేడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌కు తరలించారని, ఆ తరువాత బెలియఘాటా ఐడీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని పేర్కన్నారు.