చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్
- మధ్యాహ్నం గం.12 నుంచి సాయంత్రం గం.5 వరకు సుదీర్ఘ వాదనలు
- లంచ్ బ్రేక్‌కు ముందు వాదనలు వినిపించిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు
- మధ్యాహ్నం తర్వాత వాదనలు వినిపించిన సీఐడీ తరఫు న్యాయవాది
సీఐడీ తీరును చంద్రబాబు తరఫు న్యాయవాదులు తప్పుబట్టారు. అరెస్టుకు గవర్నర్ అనుమతి తీసుకోలేదని, సీఐడీ చంద్రబాబుకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సృష్టిస్తోందని వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున ముకుల్ రోహాత్గీ వర్చువల్ పద్ధతిలో వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయగానే చంద్రబాబును అరెస్ట్ చేయలేదని, రెండున్నరేళ్ల పాటు పూర్తి ఆధారాలు సేకరించాకే అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరోవైపు, ఏసీబీ న్యాయస్థానంలో చంద్రబాబు బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది.