Vijayasai Reddy: బెయిల్ కోసం ఆయన బెంబేలెత్తిపోతుంటే మీ బిల్డప్ ఏంటి రామా కృష్ణా?: విజయసాయిరెడ్డి

నందమూరి తారకరత్న మరణం తర్వాత కొంత కాలం పాటు రాజకీయ విమర్శలకు దూరంగా ఉన్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మళ్లీ దూకుడు పెంచారు. ప్రత్యర్థులపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ విరుచుకుపడుతున్నారు. ఏ చిన్న అవకాశం దొరికిగా ఎక్స్ వేదికగా చెలరేగిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన టీడీపీపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు గారు జైల్లో కూర్చొని విజన్ 2047 గురించి ఆలోచిస్తున్నారని, జాతీయ నేతలకు ధన్యవాదాలు చెప్పమన్నారని స్వయంప్రకటిత మేధావి యనమల రామకృష్ణుడు సెలవిచ్చారని మిమర్శించారు. బెయిల్ కోసం చంద్రబాబు బెంబేలెత్తిపోతుంటే మీ బిల్డప్ ఏంటి రామా కృష్ణా అని ఎద్దేవా చేశారు.
Vijayasai Reddy
YSRCP
Chandrababu
Yanamala
Telugudesam

More Telugu News