చంద్రబాబు అరెస్టులో కీలక పరిణామం.. కేంద్ర హోంశాఖకు ఎన్ఎస్జీ నివేదిక
- అరెస్టు నుంచి జైలుకు తరలించే వరకు పరిణామాలతో నివేదిక
- రూపొందించిన బాబు భద్రతను చూస్తున్న ఎన్ఎస్జీ సిబ్బంది
- ఎన్ఎస్జీ ప్రధాన కార్యాలయానికి కూడా నివేదిక అందజేత
తొమ్మిదో తేదీ ఉదయం 6 గంటలకు సీఐడీ అరెస్టుతో పాటు ఎన్ఎస్జీ కమాండోల భద్రతలో ఉన్న బాబు రోడ్డు మార్గంలో విజయవాడకు తరలింపు అంశాన్ని కూడా ఇందులో ప్రస్తావించింది. 10 తేదీన విచారణ సందర్భంగా భద్రతా పరంగా అంత పటిష్ఠంగా లేని కోర్టు హాలు వెలుపల ఆయనను ఉంచినట్లు పేర్కొంది. సెంట్రల్ జైల్లో ప్రస్తుతం అయన భద్రత ఏమిటన్న విషయంతో పాటు జైలు అవరణలోకి వెళ్ళే సమయంలో కొన్ని భద్రతా లోపాలు గుర్తించినట్టు తమ నివేదికలో ఎన్ఎస్జీ పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తం నివేదికను ఎన్ఎస్జీ ప్రధాన కార్యాలయానికి సమర్పించింది.