బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అరెస్ట్.. ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్తత

13-09-2023 Wed 20:09 | Telangana
Advertisement
  • రేపు ఉదయం 6 వరకు నిరాహార దీక్ష చేస్తానన్న కిషన్ రెడ్డి
  • ఈ రోజు సాయంత్రం వరకే అనుమతి ఉందన్న పోలీసులు
  • బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్రవాగ్వాదం
  • కిషన్ రెడ్డి దీక్షను భగ్నం చేసి, అదుపులోకి తీసుకున్న పోలీసులు
Advertisement
ఇందిరాపార్క్ వద్ద 24 గంటల నిరాహార దీక్ష చేస్తోన్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. తాను రేపు (గురువారం) ఉదయం వరకు దీక్ష చేస్తానని ఆయన చెప్పగా, పోలీసులు మాత్రం ఈ రోజు సాయంత్రం ఆరు గంటల వరకు అనుమతి ఉందని చెబుతూ ఆయన దీక్షను భగ్నం చేశారు. సాయంత్రం ఆరు గంటల నుంచి పోలీసులకు, కిషన్ రెడ్డికి మధ్య వాగ్వాదం కొనసాగింది.

ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్తలను పక్కకు తప్పించి కిషన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు, కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా తన దీక్ష కొనసాగుతుందన్నారు. శాంతియుత దీక్ష వల్ల పోలీసులకు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు.
Advertisement
G. Kishan ReddyTelanganaBJPBRS

More Telugu News

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12
..more