తిరుమలలో చిక్కిన మరో చిరుత
- నాలుగు రోజుల క్రితం చిరుతను గుర్తించిన అధికారులు
- అలిపిరి-తిరుమల నడకమార్గంలో కొత్తమండపం వద్ద తాజాగా బోనులో చిక్కిన వైనం
- ఇప్పటివరకూ మొత్తం ఐదు చిరుతల పట్టివేత
ఇటీవల అలిపిరి నడక మార్గంలో చిరుత దాడిలో నెల్లూరుకు చెందిన ఆరేళ్ల బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో, అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు తిరుమల కొండల్లో పలు చోట్ల బోనులు ఏర్పాటు చేసి చిరుతలను బంధిస్తున్నారు.