కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనంపై కేసీ వేణుగోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనంపై కేసీ వేణుగోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

KC Venugopal on YSRTP merger with Congress
  • సోనియా, రాహుల్ గాంధీలను షర్మిల కలిశారన్న వేణుగోపాల్
  • వారి మధ్య స్నేహపూర్వక భేటీ జరిగిందని వెల్లడి
  • వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనంపై వేచి చూడాలని వ్యాఖ్య
షర్మిల నేతృత్వంలోని వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పందించారు. సోమవారం ఆయన ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ... తమ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను షర్మిల కలిశారన్నారు. వారి మధ్య స్నేహపూర్వక భేటీ జరిగిందని తెలిపారు. షర్మిల కూడా ఇటీవల ఈ అంశంపై మాట్లాడినట్లు తెలిపారు. కాంగ్రెస్‌లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనంపై వేచి చూడాలన్నారు.

కాగా, షర్మిల గత నెల 31న సోనియా గాంధీతో భేటీ అయ్యారు. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే అంశంపై ఆమె చర్చించినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత షర్మిల మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోనియాతో నిర్మాణాత్మక చర్చలు జరిగాయన్నారు. ఈ నేపథ్యంలో షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే దిశగా వెళ్తోందనే ప్రచారం సాగుతోంది.
Advertisement
kc venugopal
YS Sharmila
Congress

More Telugu News