చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ రికార్డును బ్రేక్ చేసిన యువ కెరటం
- 1986 నుంచి భారత నం.1గా ఉన్న ఆనంద్
- దిగ్గజాన్ని వెనక్కునెట్టిన డి. గుకేశ్
- ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 8వ స్థానం సొంతం
ప్రపంచ చెస్ సమాఖ్య –ఫిడే నిన్న విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో గుకేశ్ 2758 రేటింగ్ పాయింట్లతో ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిదో ర్యాంక్ సాధించాడు. ఆనంద్ 2754 పాయింట్లతో తొమ్మిదో ర్యాంక్‌కు పడిపోయాడు. దాంతో, భారత్ తరఫున టాప్ ప్లేస్ గుకేశ్ సొంతమైంది. ఐదు సార్లు ప్రపంచ విజేతగా నిలిచిన ఆనంద్ 1986 జులై1వ తేదీ నుంచి భారత నంబర్ వన్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. మూడున్నర దశబ్దాలుగా చెక్కుచెదరని ఈ రికార్డును గుకేశ్ బద్దలు కొట్టాడు.