ప్రభుత్వంతో కలిసి పని చేస్తాం: జగన్‌ను కలిసిన యూనిసెఫ్ టీమ్

01-09-2023 Fri 20:44 | Andhra
Advertisement
  • గ్రామ, వార్డు సచివాలయాలకు అనుసంధానంగా వైద్య, ఆరోగ్య రంగంలో కలిసి పని చేస్తామన్న యూనిసెఫ్ ప్రతినిధులు
  • ప్రభుత్వానికి అవసరమైన తోడ్పాటు ఇచ్చేందుకు ముందుకొచ్చిన యూనిసెఫ్
  • ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించిన జగన్, అభినందించిన ప్రతినిధులు
Advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని యూనిసెఫ్ ఫీల్డ్ ఆఫీస్ చీఫ్ జెలాలెం బీ టఫాస్సే (ఏపీ, కర్ణాటక, తెలంగాణ) సీఎం క్యాంప్ కార్యాలయంలో కలిశారు. గ్రామ, వార్డు సచివాలయాలకు అనుసంధానంగా వైద్య, ఆరోగ్య రంగంలోని వివిధ స్థాయుల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.

ప్రైమరీ హెల్త్‌ కేర్‌లో మిడ్ లెవల్‌ హెల్త్ ప్రొవైడర్స్(ఎంఎల్‌హెచ్‌పీలు), ఫ్యామిలీ ఫిజీషియన్, ఆశా, అంగన్వాడీ వర్కర్స్, ఏఎన్‌ఎంలు, హెల్త్ అండ్‌ వెల్నెస్ సెంటర్స్‌ వంటి వివిధ స్ధాయుల్లో ప్రభుత్వానికి అవసరమైన విధంగా తోడ్పాటు ఇచ్చేందుకు యూనిసెఫ్‌ ముందుకొచ్చింది.

వివిధ రంగాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ బృందంతో సీఎం జగన్ చర్చించారు. ఆరోగ్య సురక్ష పేరుతో త్వరలో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఏపీని చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ స్టేట్‌గా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో ముందుకెళ్తున్న తీరును సీఎం వివరించగా, యూనిసెఫ్ యూనిసెఫ్‌ ఫీల్డ్ ఆఫీస్ చీఫ్ అభినందించారు.

చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వారికి అందజేస్తున్న పౌష్టికాహారం, యాక్షన్‌ ప్లాన్, మహిళా రక్షణ, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పర్యవేక్షణ, మహిళా పోలీసుల ద్వారా మహిళలు, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలను అరికట్టడం వంటి కీలక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాయం అందిస్తామని యూనిసెఫ్ టీమ్ తెలిపింది.

ఈ సమావేశంలో యూనిసెఫ్‌ హెల్త్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ ఆర్పీ శ్రీధర్, యూనిసెఫ్‌ సోషల్‌ బిహేవియర్‌ చేంజ్‌ స్పెషలిస్ట్‌ సీమ, సీఎం చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, సీఎం స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ పూనం మాలకొండయ్య,  మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ జానకి పాల్గొన్నారు.
Advertisement
unicefYS JaganAndhra Pradesh

More Telugu News

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12
..more