భారత చిత్ర పరిశ్రమలో తొలిసారి.. అల్లు అర్జున్ కోసం హైదరాబాద్ వచ్చిన ఇన్‌స్టాగ్రామ్ .. ఓ రోజంతా బన్నీతో!
- పుష్ప సినిమాతో జాతీయ అవార్డు గెలిచిన అర్జున్
- ప్రపంచ వ్యాప్తంగా బన్నీ ఫ్యాన్స్ కోసం ప్రత్యేక వీడియో రూపొందించిన ఇన్‌స్టాగ్రామ్
- నిద్ర లేచింది మొదలు.. నిద్రపోయే వరకూ కీలక విషయాల వెల్లడి
ప్రపంచ వ్యాప్తంగా అల్లు అర్జున్ అభిమానులకోసం ఇన్ స్టాగ్రామ్ మొదటిసారిగా, భారత్, హైదరాబాద్ వచ్చి, అల్లు అర్జున్ తో కలిసి వీడియో చేసింది. ఈ వీడియోలో బన్నీ నివాసం, రామోజీ ఫిల్మ్ సిటీలో 'పుష్ప 2' షూటింగ్ స్పాట్, తన అభిమానులతో బన్నీ ఎలా ఉంటాడనే విషయాలను చూపించింది. ప్రతి రోజు లేవగానే గార్డెన్ లోకి వచ్చి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ బ్లాక్ కాఫీ తాగడం, మధ్యాహ్నం ఒంటి గంట అవగానే తన పిల్లలతో వీడియో కాల్ చేసి మాట్లాడే విషయాలను చూపెట్టింది. ఇక సెట్స్ లో దర్శకుడు సుకుమార్ తో సినిమా గురించి చర్చించి, సెట్స్‌లో ఓ షాట్ ను చిత్రీకరించే విషయాన్ని కూడా వీడియోలో చూపించారు.