కోరుట్లలో కలకలం.. అనుమానాస్పద స్థితిలో అక్క మృతి, చెల్లెలు అదృశ్యం

30-08-2023 Wed 08:44 | Telangana
Advertisement
  • కోరుట్ల పట్టణంలోని భీమునిదుబ్బలో ఘటన
  • వంటింట్లో మద్యం, కూల్‌డ్రింక్ బాటిల్స్, తినుబండారాలు
  • మరో యువకుడితో బస్టాండ్‌లో కనిపించిన చెల్లెలు
  • గాలిస్తున్న పోలీసులు
Advertisement
జగిత్యాల జిల్లా కోరుట్లలో ఓ ఇంట్లో యువతి మృతి చెందగా, ఆమె చెల్లెలు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని భీమునిదుబ్బకు చెందిన దీప్తి (24) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తోంది. ఆమె చెల్లెలు చందన బీటెక్ పూర్తిచేసి ఇంటి వద్దే ఉంటోంది. ఆమె సోదరుడు సాయి బెంగళూరులో డిగ్రీ చదువుతున్నాడు. బంధువుల గృహప్రవేశం ఉండడంతో దీప్తి తల్లిదండ్రులు శ్రీనివాస్‌రెడ్డి, మాధవి దంపతులు ఆదివారం హైదరాబాద్ వెళ్లారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో కుమార్తెకు ఫోన్ చేసి మాట్లాడారు. మంగళవారం మధ్యాహ్నం మరోమారు  ఫోన్ చేయగా, దీప్తి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. చందన ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసి ఉంది.

దీంతో అనుమానించిన వారు పొరుగింటి వారికి ఫోన్ చేసి సమాచారమిచ్చారు. ఇంటికివెళ్లి చూసిన వారు షాకయ్యారు. సోఫాలో దీప్తి మృతదేహం, వంటగదిలో రెండు మద్యం సీసాలు, కూల్‌డ్రింక్ బాటిల్, తినుబండారాల ప్యాకెట్లు కనిపించాయి. చందన జాడ లేకపోవడంతో వారు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చందన కనిపించకపోవడంతో అనుమానించారు. వెంటనే ఆమె కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఉదయం 5.12 గంటల నుంచి నాలుగైదు నిమిషాలపాటు ఓ యువకుడితో కలిసి బస్టాండ్‌లో ఉన్నట్టు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఆ తర్వాత నిజమాబాద్ బస్సు ఎక్కింది. దీంతో ఈ కేసు మిస్టరీగా మారింది. వారిద్దరూ దొరికితే కేసు చిక్కుముడి వీడుతుందని భావిస్తున్నారు. ఇంట్లోకి మద్యం సీసాలు ఎలా వచ్చాయి? చందన ఎందుకు పారిపోయిందనే విషయాన్ని ఆరా తీస్తున్నారు.
Advertisement
JagityalKorutlaCrime NewsMissing Case

More Telugu News

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12
..more