అల్లు అర్జున్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు
- రెండు రోజుల క్రితం 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన
- జాతీయ చలనచిత్ర అవార్డు విజేతలకు కేసీఆర్ అభినందనలు
- అల్లు అర్జున్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపిన కేసీఆర్
రెండు రోజుల క్రితం 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పుష్ప సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది. తెలుగు సినిమాలకు మొత్తం పదకొండుకు పైగా అవార్డులు దక్కాయి. ఇందులో ఆర్ఆర్ఆర్ సినిమాకే ఆరు అవార్డులు దక్కాయి.