బీసీసీఐకి మళ్లీ కాసుల పంట.. మూడేళ్లకు రూ. 235 కోట్లు చెల్లించనున్న ప్రైవేట్ బ్యాంక్
- బీసీసీఐ టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులు చేజిక్కించుకున్న ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంక్
- స్వదేశంలో జరిగే మ్యాచ్‌లకు మూడేళ్ల కాలానికి హక్కుల కొనుగోలు
- ఒక్కో అంతర్జాతీయ మ్యాచ్ కు రూ.4.20 కోట్లు
కొత్త ఒప్పందం ప్రకారం ఐడీఎఫ్సీ ఒక్కో అంతర్జాతీయ మ్యాచ్ కు బీసీసీఐకి రూ. 4 కోట్ల 20 లక్షలు చెల్లించనుంది. భారత్ లో రాబోయే మూడేళ్ల వ్యవధిలో మొత్తం 56 అంతర్జాతీయ మ్యాచ్ లు జరగనున్నాయి. వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్ తో మొదలయ్యే ఒప్పందం 2026 ఆగస్టు వరకు అమల్లో ఉంటుంది. ఈ ఒప్పందానికి ముందు వరకు టైటిల్ స్పాన్సర్‌గా ఉన్న 'మాస్టర్ కార్డ్' ఒక్కో మ్యాచ్ కు రూ.3 కోట్ల 80 లక్షలు బీసీసీఐకి చెల్లించింది.