Samantha: సమంత చేసిన ఘాటు వ్యాఖ్యలు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ను ఉద్దేశించేనా?

Samantha indirect comments on Vijay Devarakonda
షార్ట్స్‌లో చూడండి
ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చినప్పటికీ సమంత ప్రతి రోజూ హాట్ టాపిక్ గానే ఉంటున్నారు. ఇటీవల బాలీ టూర్ కు వెళ్లిన సమంత అక్కడి నుంచి పోస్ట్ చేసిన ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. సమంత నటించిన చివరి చిత్రం 'ఖుషి' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ నటించారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో సమంత పాల్గొనలేదు. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనకపోతే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, సోషల్ మీడియా ద్వారా సమంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ లోకం కోసం మీరు బతకాల్సిన అవసరం లేదని, మీరు మీ కోసం బతకండని సామ్ మండిపడ్డారు. ఈ సమాజం మిమ్మల్ని గుర్తించకపోవచ్చని, మీ గౌరవం ఏమిటో తెలుసుకుని, మీ స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. పది మందిలో ఒకరిలా కాకుండా ఒక ప్రత్యేకమైన గుర్తింపుతో బతికేందుకు ప్రయత్నించండని వ్యాఖ్యానించింది. అయితే, ఈ కామెంట్స్ ఎవరి గురించి చేసిందో మాత్రం సమంత చెప్పలేదు. అయినప్పటికీ విజయ్ దేవరకొండ ఫ్యాన్ ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని సినీ అభిమానులు భావిస్తున్నారు. 

మరోవైపు 'ఖుషి' మూవీ సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. విజయ్ దేవరకొండకు 'లైగర్', సమంతకు 'శాకుంతలం' చేదు అనుభవాన్ని మిగిల్చాయి. దీంతో, వీళ్లిద్దరూ కమ్ బ్యాక్ కావడానికి 'ఖుషి' హిట్ కొట్టడం చాలా అవసరం.
Go Back to Shorts
Samantha
Vijay Devarakonda
Kushi Movie
Tollywood
Troll

More Telugu News