ఏడేళ్ల తర్వాత భారత్ పై సిరీస్ సొంతం చేసుకున్న వెస్టిండీస్
- ఐదో టీ20లో ఓడిన టీమిండియా
- విండీస్ ను గెలిపించిన బ్రెండన్ కింగ్
- 3-2తో సిరీస్ గెలిచిన కరీబియన్ జట్టు
హైదరాబాదీ తిలక్ వర్మ (27) ఫర్వాలేదనిపించగా మిగతా బ్యాటర్లంతా నిరాశ పరిచాడు. లక్ష్య ఛేదనలో ఓపెనర్ బ్రాండన్ కింగ్ (55 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 85 నాటౌట్) దూకుడుగా ఆడటంతో విండీస్ 18 ఓవర్లలో 2 వికెట్లకు 171 పరుగులు చేసి సులువుగా గెలిచింది. నికోలస్ పూరన్ (35 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 47) కూడా రాణించాడు. నాలుగు వికెట్లు తీసిన రొమారియో షెఫర్డ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ లో టాప్ స్కోరర్ అయిన నికోలస్ పూరన్ కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి.