ఇన్నాళ్లూ చిరంజీవిని పెద్దమనిషిగా భావించాం!: రోజా

Minister Roja slams Chiranjeevi for his comments on AP government
  • చిరంజీవికి సడన్‌గా ఏమైందో కానీ విషం చిమ్ముతున్నారన్న రోజా
  • పవన్, బాబు, లోకేశ్ ఏపీలో ఇల్లు కట్టుకొని ఉంటామని చెప్పారా అని ప్రశ్న
  • జగన్ తండ్రి ఆశయాలను ముందుకు నడిపిస్తున్నారని వ్యాఖ్య
 ఇన్నాళ్లూ చిరంజీవి పెద్దమనిషిగా, బ్యాలెన్స్‌డ్‌గా ఉండే వ్యక్తి అని భావించామని, కానీ సడన్‌గా ఆయనకు ఏమైందో కానీ జగన్‌కు సలహాలు ఇస్తూ విషం చిమ్మడం ప్రారంభించారని మంత్రి ఆర్కే రోజా అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఇటీవల చిరంజీవి చేసిన వ్యాఖ్యలను మరోసారి తప్పుబట్టారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ లు ఏపీలో ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటామని ఎప్పుడైనా చెప్పారా? వారికి కనీసం ఆ ఆలోచన వచ్చిందా? అని ప్రశ్నించారు.

కానీ జగన్ ఎమ్మెల్యేగా ఇడుపులపాయలో ఇల్లు నిర్మించుకొని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నారని, ఆ తర్వాత ప్రతిపక్ష నేతగా ప్రజలకు అందుబాటులో ఉండేందుకు తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారన్నారు. జగన్ తన తండ్రి ఆశయాలను ముందుకు నడిపించే ఉద్ధేశ్యంతో ముందుకు సాగారని, ఎన్ని కష్టాలు, అవమానాలు, నిందలు వచ్చినా భరించారన్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను చూసి వాటిని తీరుస్తానని భరోసా ఇచ్చారని, ఇప్పుడు అందుకు అనుగుణంగా పని చేస్తున్నారన్నారు.
Go Back to Shorts
Roja
Chiranjeevi
Pawan Kalyan

More Telugu News