పవన్ సమక్షంలో జనసేనలో చేరిన మాజీ మంత్రి పడాల అరుణ

మాజీ మంత్రి పడాల అరుణ జనసేనలో చేరారు. జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో ఆమె జనసేన తీర్థం పుచ్చుకున్నారు. మూడో విడత వారాహి యాత్ర కోసం విశాఖకు పవన్ వెళ్లిన సంగతి తెలిసిందే. విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి ఆయన దసపల్లా హోటల్ కు వెళ్లారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో పడాల అరుణ జనసేనలో చేరారు. 

గజపతినగరం నుంచి పడాల అరుణ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989, 1994, 2004 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలుపొందారు. 2009 ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా కూడా పని చేశారు. అయితే పార్టీలో తనకు ప్రాధాన్యత లభించడం లేదంటూ రెండేళ్ల క్రితం ఆమె టీడీపీకి రాజీనామా చేశారు. కొన్ని రోజుల క్రితం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ ను అరుణ కలిశారు. 

ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ... ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి పవన్ కల్యాణ్ నాయకత్వం అవసరమని చెప్పారు. ఈ కారణం వల్లే తాను జనసేనలో చేరానని అన్నారు. యువతకు మేలు చేసే పవన్ నిర్ణయాలు, ఆలోచనలు తనకు నచ్చాయని చెప్పారు.


More Telugu News