కడపలో దంచికొట్టిన వాన.. జలమయంగా మారిన రోడ్లు.. వీడియో ఇదిగో!
- తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా కురిసిన వర్షం
- రోడ్లపై మోకాళ్ల లోతు వరద.. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు
- మొరాయించిన వాహనాలు.. పలుచోట్ల ట్రాఫిక్ జామ్
నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ తో పాటు అంబేడ్కర్ చౌరస్తా, కో్ర్టు రోడ్, భరత్ నగర్, చైన్నై రోడ్, మృత్యుంజయ కుంట, గంజికుంట కాలనీ, అక్కయ్యపల్లి, ప్రకాశ్ నగర్ తదితర ఏరియాలలోకి నీరు చేరింది. రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. ఈ వరద నీటిని తొలగించేందుకు నగరపాలక అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. అక్కయ్యపాలెంలో పాత గోడ కూలిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.