చిరంజీవి ఏది పడితే అది మాట్లాడితే ఎలా... మొదట పవన్‌కు జ్ఞానబోధ చేయాలి: మంత్రి అమర్నాథ్
- సినిమాలను మొదట రాజకీయాల్లోకి ఎవరు లాగారో చెప్పాలన్న మంత్రి
- బ్రో సినిమాలో అంబటి పాత్రను పెట్టామని చెప్పే ధైర్యం కూడా లేదని వ్యాఖ్య
- సినిమాలను పిచ్చుక అంటూ పరిశ్రమను తక్కువ చేస్తే ఎలా?
బ్రో సినిమాలో మంత్రి అంబటి రాంబాబు పాత్రను సృష్టించింది ఎవరు? అని అడిగారు. ఆ పాత్ర అంబటిదేనని చెప్పే ధైర్యం కూడా వారికి లేదన్నారు. అసలు బ్రో సినిమాలో క్యారెక్టర్ పెట్టారో లేదో చెప్పగలరా? అన్నారు. తొలుత తమ్ముడికి జ్ఞానబోధ చేసి, ఆ తర్వాత రాజకీయ నాయకులకు సూచనలు చేయవచ్చునని చిరంజీవికి సూచించారు. ఏది పడితే అది మాట్లాడటం సరికాదన్నారు. సినిమాలను పిచ్చుక అని అంటూ పరిశ్రమను తక్కువ చేస్తే ఎలా? అన్నారు.
అంతకుముందు అంబటి రాంబాబు మాట్లాడుతూ... తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలని చిరంజీవికి సూచించారు. బ్రో సినిమాలో తన క్యారెక్టర్ పెట్టారా? లేదా? చెప్పాలన్నారు. చిరంజీవి ఏం మాట్లాడారో చూసి రేపు మాట్లాడుతానన్నారు. చిరంజీవి అంటే తనకు గౌరవం ఉందన్నారు.