దొంగతనానికి వచ్చిన నల్లజాతీయుడిని చావబాదిన ఎన్నారై.. వీడియో ఇదిగో!
- కాలిఫోర్నియాలో వెలుగు చూసిన ఘటన
- కిరాణాషాపులో దొంగతనానికి వచ్చిన నల్లజాతీయుడు
- తిరగ బడ్డ షాపు ఓనర్, దొంగకు బెత్తంతో బుద్ధి చెప్పిన వైనం
- షాపు ఓనర్ దెబ్బలకు తట్టుకోలేక పొలికేకలు పెట్టిన దొంగ
- కిరాణా షాపు యజమానిపై నెటిజన్ల ప్రశంసలు
దొంగ జోలికి వెళ్లద్దంటూ ఎన్నారైని షాపులో ఉన్న మరో వ్యక్తి కూడా హెచ్చరించాడు. కానీ, తన కష్టం అలా దొంగలపాలవడం భరించలేకపోయిన ఆ ఎన్నారై ధైర్యం తెచ్చుకుని దొంగను కర్రతో చావబాదాడు. తొలుత దొంగను ఓ వ్యక్తి అడ్డుకుని కిందపడేసి కదలకుండా చేయగా రెండో వ్యక్తి కర్ర తీసుకుని కొట్టాడు.
ఆ ఎన్నారై చేసిన పనికి నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం మిన్నకుండిపోతే ప్రజలే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారని అనేక మంది హెచ్చరించారు. ఇటీవల కాలంలో అమెరికాలో ఇలాంటి దొంగతనాలు పెరిగిపోతున్నాయి. చిరు, మధ్యతరగతి వ్యాపారులే టార్గెట్‌గా మారుతున్నారంటూ అనేక మంది విచారం వ్యక్తం చేశారు.