Anand Mahindra: ఆ హీరో వయసు 57 ఏళ్లా? .. షారుఖ్ పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్!

Anand Mahindra showers praises on shahrukh khan over his newly released song in jawan
షార్ట్స్‌లో చూడండి
సమకాలీన అంశాలపై సోషల్ మీడియాలో యాక్టివ్‌గా స్పందించే పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా పలు విజ్ఞానదాయక అంశాలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. అప్పుడప్పుడూ ఆయన సరదా వ్యాఖ్యలు కూడా చేస్తుంటారు. తాజాగా ఆయన బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ను ఉద్దేశించి చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. చివరకు షారుఖ్ ఖాన్ స్వయంగా ఆనంద్ మహీంద్రాకు రిప్లై ఇచ్చారు. 

ఆ వివరాలలోకి వెళితే.. కొన్ని రోజుల క్రితం షారుఖ్ నటించిన జవాన్ చిత్రంలోని జిందాబాద్ సాంగ్ విడుదలైంది. యూత్‌ఫుల్ లుక్స్‌లో అదరగొట్టిన షారుఖ్‌పై ఆనంద్ మహీంద్రా తాజాగా ట్వీట్ చేశారు. ‘‘ఈ హీరో వయసు 57 ఏళ్లా? గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ఆయన వయసు పెరుగుతున్నట్టు ఉంది. మిగతా వారికంటే ఆయన పది రెట్లు అధికంగా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు’’ అని ట్వీట్ చేశారు. 

ఈ ట్వీట్‌పై షారుఖ్ వెంటనే స్పందించారు. ‘‘జీవితం చాలా చిన్నదే కాదు వేగవంతమైంది కూడా సార్. ఈ స్పీడును అందుకునేందుకు ట్రై చేస్తున్నా. సంతోషం, దుఖం, డ్యాన్స్, చుక్కల్లో విహరించేలా భావన కల్పించడం.. ఇలా ఎలా వీలైతే అలా వీలైనంతమందికి వినోదం పంచేందుకు ప్రయత్నిస్తున్నా. సంతోషమైన క్షణాల కోసం కలకంటున్నా’’ అని రిప్లై ఇచ్చారు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అనేక మంది షారుఖ్‌కు ఉన్న అనారోగ్య సమస్యలను కూడా ప్రస్తావించారు.
Go Back to Shorts
Anand Mahindra
Shahrukh Khan
Bollywood

More Telugu News