Jagapathi Babu: ఇంత స్టార్ డమ్ ఉన్నప్పటికీ నాకు చెప్పకుండా తీసేసినవాళ్లున్నారు: జగపతిబాబు

Jagapathibabu Interview
  • ఒకప్పుడు హీరోగా మెప్పించిన జగపతిబాబు 
  • ఇప్పుడు స్టార్ విలన్ గా ఫుల్ బిజీ
  • తక్కువకి చేస్తే తక్కువగా చూస్తున్నారన్న జగ్గూ భాయ్
  • బేరాలు ఆడటం తనకి నచ్చదని వెల్లడి

జగపతిబాబు .. ఒకప్పుడు స్టార్ హీరో .. ఇప్పుడు స్టార్ విలన్. తన మనసులోని మాటను సూటిగా చెప్పడం ఆయన స్వభావం. సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "ఇతర భాషల నుంచి వచ్చే ఆర్టిస్టులకు ఇక్కడ ఎక్కువ గౌరవం ఇస్తున్నారు. నేను వేరే భాషల్లో చేసేటప్పుడు అలాంటి గౌరవాన్ని పొందుతున్నాను. ఇక్కడ మాత్రం నన్ను లైట్ గానే తీసుకుంటున్నారు" అని అన్నారు. 

"పారితోషికం తక్కువైనా .. అసలు ఇవ్వలేకపోయినా నేను చేస్తాను. కానీ అంత ఎందుకు ఇవ్వాలి? అంటూ బేరాలు ఆడటానికి ట్రై చేస్తే మాత్రం నేను చేయను. నా పారితోషికం తప్ప నాకు సంబంధించిన ఏ ఖర్చును నేను నిర్మాతను పెట్టనివ్వను. నా మంచి నీళ్ల బాటిల్ సహా అన్నీ నేనే ఏర్పాటు చేసుకుంటాను. డబ్బు తగ్గినా ఫరవాలేదని చేస్తూ ఉంటే, నన్ను తగ్గించి చూడటం మొదలుపెడుతున్నారు" అని చెప్పారు. 

"ఇక అన్నీ మాట్లాడుకున్న తరువాత నన్ను తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నన్ను పక్కన పెడుతున్నప్పుడు ఆ విషయాన్ని నాకు సున్నితంగా చెప్పొచ్చు. కానీ నాకు చెప్పాపెట్టకుండానే తొలగించారు. ఆ విషయం తెలిసి మరో రెండు సినిమాలకి సంబంధించిన వాళ్లు అలాగే చేశారు. డబ్బులు ఇవ్వకపోయినా ఫరవాలేదు గానీ .. గౌరవం ఇవ్వని చోట మాత్రం నేను పనిచేయను" అంటూ చెప్పుకొచ్చారు. 

More Telugu News

Jagapathi Babu
Actor
Tollywood