ఆగస్టు 16 నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్ రెండో సీజన్... రేపు ఆటగాళ్ల వేలం

ఆగస్టు 16 నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్ రెండో సీజన్... రేపు ఆటగాళ్ల వేలం

Andhra Premiere League second season will commence from August 16
  • ఇప్పటికే ఆంధ్రా ప్రీమియర్ లీగ్-1 నిర్వహించిన ఏసీఏ
  • నేడు సెకండ్ సీజన్ ఆవిష్కరణ కార్యక్రమం
  • తొలి సీజన్ విజయవంతమైందన్న ఏసీఏ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి
  • రెండో సీజన్ లో 6 జట్లు పాల్గొంటాయని వెల్లడి
ఐపీఎల్ తరహాలో ఆంధ్రా క్రికెట్ సంఘం ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) పోటీలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఆంధ్రా ప్రీమియర్ లీగ్-1 నిర్వహించింది. తాజాగా విశాఖలోని పీఎం పాలెం స్టేడియంలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్-2 టోర్నీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. దీనిపై ఆంధ్రా క్రికెట్ సంఘం కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి స్పందించారు. 

ఆంధ్రా ప్రీమియర్ లీగ్-1 విజయవంతమైందని తెలిపారు. మొదటి లీగ్ కంటే రెట్టింపు ఉత్సాహంతో రెండో సీజన్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆంధ్రా ప్రీమియర్ లీగ్-2లో భాగంగా ఆగస్టు 16 నుంచి 27 వరకు మ్యాచ్ లు జరుగుతాయని వెల్లడించారు. ఇందులో 6 జట్లు పాల్గొంటాయని వివరించారు. ఆటగాళ్ల ఎంపిక కోసం రేపు వేలం ప్రక్రియ నిర్వహిస్తున్నామని గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు.
Advertisement
Andhra Premiere League-2
ACA
Visakhapatnam
Andhra Pradesh

More Telugu News