తెలంగాణలోని పది జిల్లాలకు నేడు అత్యంత భారీ వర్షాల రెడ్ అలర్ట్
- ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలు
- పలు జిల్లాల్లో వరదల్లో చిక్కుకున్న ప్రజలు
- మరో రోజు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడి
అలాగే, ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, హన్మకొండ, జనగాం, వరంగల్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరిక కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది.