భారత్ తో వన్డేలకు భారీ హిట్టర్‌ను దింపుతున్న వెస్టిండీస్
- తిరిగి విండీస్ జట్టులోకి వచ్చిన షిమ్రన్ హెట్ మయర్
- పేసర్ ఒషేన్ థామస్ కు కూడా చోటు
- రేపటి నుంచి భారత్–విండీస్ వన్డే సిరీస్
మాజీ కెప్టెన్ నికోలస్ పూరన్, ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్‌తో పాటు గాయంతో ఇబ్బందిపడుతున్న ఆల్‌రౌండర్ కీమో పాల్ ఈ సిరీస్‌కు దూరంగా ఉంటున్నారు. భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్ నకు అర్హత సాధించడంలో విఫలమైన విండీస్ ఈ సిరీస్ లో రాణించాలని ఆశిస్తోంది. గురువారం, శనివారం కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా తొలి రెండు వన్డేలు జరుగుతాయి. ఆగస్ట్ 1న ట్రినిడాడ్‌లో మూడో వన్డే ఉంటుంది. తర్వాత ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతుంది.
వెస్టిండీస్ వన్డే జట్టు: షై హోప్ (కెప్టెన్), రొవ్‌మన్ పావెల్, అలిక్ అథానజే, యానిక్ కారియా, కేసీ కార్టీ, డొమినిక్ డ్రేక్స్, హెట్‌మయర్, అల్జారీ జోసెఫ్, బ్రెండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడకేశ్ మోతీ, జైడెన్ సీల్స్, రొమారియో షెఫర్డ్, కెవిన్ సింక్లెర్, ఒషేన్ థామస్.