అతను మా ఇంట్లోకి రాడు.. కానీ ఆ రోజు: వివేకా హత్య కేసులో సునీత భర్త వాంగ్మూలం
- ఇప్పటికే వెలుగులోకి షర్మిల, సునీతా రెడ్డి వాంగ్మూలాలు
- సీబీఐ ఎదుట కీలక విషయాలు వెల్లడించిన రాజశేఖరరెడ్డి
- లేఖను ఎందుకు దాచిపెట్టమన్నదీ వెల్లడించిన సునీత భర్త
ప్రసాద్ కు ప్రాణహానిని దృష్టిలో పెట్టుకొని తాను వచ్చి వ్యక్తిగతంగా పోలీసులకు లేఖను ఇస్తానని చెప్పానని వాంగ్మూలంలో తెలిపారు. వివేకా పేరు మీద ఉన్న ఆస్తుల గురించి సీబీఐ ప్రశ్నించగా తనకు కొన్ని తెలుసునని రాజశేఖరరెడ్డి సమాధానం చెప్పారు. హత్య జరగడానికి ముందు రోజు కడప ఎంపీగా తాను పోటీ చేయనున్నట్లు జమ్మలమడుగులో వివేకా చెప్పారని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. హత్యకు ముందు రోజు మార్చి 14న శివశంకర్ రెడ్డి గూగుల్ టేకవుట్ లొకేషన్ ను సీబీఐ చూపించగా వివేకా ఇంటిదేనని గుర్తించారు. సాధారణంగా శివశంకర్ రెడ్డి తమ ఇంట్లోకి రాడని చెప్పారు.
ఆ రోజు పీఏ కృష్ణారెడ్డి ఫోన్ చేసి వివేకానందరెడ్డి పులివెందులకు ఎప్పుడు వస్తున్నారని ఆరా తీశారని, తాము కడపలో ఉన్నామని చెప్పినట్లు రాజశేఖరరెడ్డి తెలిపారు. రాజశేఖరరెడ్డిని సాక్షిగా పేర్కొంటూ ఆయన వాంగ్మూలాన్ని గత నెల 30న అనుబంధ ఛార్జీషీట్ తో పాటు సీబీఐ కోర్టుకు సమర్పించింది.