ఎన్డీయే పక్షాల సమావేశం, ప్రధాని మోదీ వెనకే పవన్ కల్యాణ్!
- ఢిల్లీ ది అశోక్ హోటల్లో ప్రారంభమైన ఎన్డీయే పక్షాల సమావేశం
- మూడోసారి ఎన్డీయే అధికారంలోకి రావడమే లక్ష్యంగా 38 పార్టీలతో సమావేశం
- హాజరైన షిండే, చిరాగ్ పాశ్వాన్, పవన్ కల్యాణ్, పళనిస్వామి
సాయంత్రం ఐదు గంటల సమయంలో ప్రధాని మోదీ సమావేశం జరగనున్న హోటల్ కు వచ్చారు. ఆయనకు జేపీ నడ్డా, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే తదితరులు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ భేటీకి ఏక్ నాథ్ షిండే వర్గం శివసేన, లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, అన్నాడీఎంకే నేత పళనిస్వామి తదితరులు హాజరయ్యారు. ఈ భేటీకి నితిన్ గడ్కరీ, రాజ్ నాథ్, జేపీ నడ్డా, అమిత్ షా తదితర బీజేపీ నేతలు హాజరయ్యారు.