హాయ్ నాన్న.. నాని 30వ సినిమా టైటిల్ ఇదే!
- కొత్త దర్శకుడు శౌర్యువ్‌తో నాని సినిమా
- హీరోయిన్‌గా నటిస్తున్న మృణాళ్ ఠాకూర్
- డిసెంబర్ 21న ఐదు భాషల్లో విడుదల
ఈ చిత్రంలో నాని కూతురుగా బేబి కైరా ఖన్నా నటిస్తోంది. ఈ సినిమాను వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ నిర్మిస్తున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన హెశమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తున్నాడు. దసరా మాదిరిగా ఈ చిత్రాన్ని కూడా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. డిసెంబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది.