ఉద్యోగులకు షాకిచ్చిన ఇన్ఫోసిస్!
- జీతాల పెంపును వాయిదా వేసిన ఇన్ఫోసిస్
- శాలరీ హైక్‌పై ఇప్పటివరకూ ఉద్యోగులకు అందని సమాచారం
- 2020 తరువాత తొలిసారిగా జీతాలు పెంచేందుకు యాజమాన్యం వెనుకంజ
ప్రతి ఏటా ఏప్రిల్ నుంచి ఇన్ఫోసిస్‌లో జీతాలు పెంపు మొదలవుతుంది. పెంచిన శాలరీ వివరాలను సంస్థ సాధారణంగా జూన్ నెలకే ఉద్యోగులకు తెలియజేస్తుంది. అయితే, పెంపు విషయంలో తమకు ఇప్పటివరకూ అధికారికంగా ఎటువంటి సమాచారం అందలేదని అనేక మంది ఉద్యోగులు చెప్పారు. ఇన్ఫోసిస్‌లో జీతాల పెంపు వాయిదా పడటం 2020 తరువాత ఇదే తొలిసారి. కరోనా సంక్షోభం కారణంగా అప్పట్లో సంస్థ శాలరీ హైక్‌ను వాయిదా వేసింది.