నాని 30వ సినిమా కోసం పరిశీలనలో ఉన్న టైటిల్స్ ఇవే!
- షూటింగు దశలో నాని 30వ సినిమా
- తండ్రీకూతుళ్ల అనుబంధం చుట్టూ తిరిగే కథ
- నాని సరసన నాయికగా కనిపించనున్న మృణాల్ ఠాకూర్
- త్వరలో రిలీజ్ కానున్న టైటిల్ పోస్టర్
ఇది తండ్రీ .. తన గారాల కూతురుకి సంబంధించిన కథ. ఈ రెండు పాత్రల మధ్య చోటుచేసుకునే ఎమోషన్స్ తో కూడిన కథ. అలాంటి ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. చాలా టైటిల్స్ ను పరిశీలించారు. వాటిలో ఒక మూడు టైటిల్స్ ను ముందు వరుసలో నిలబెట్టారు.
ఆ జాబితాలో హలో డాడీ .. హలో నాన్న .. హాయ్ నాన్న అనే టైటిల్స్ కనిపిస్తున్నాయి. ఈ మూడు టైటిల్స్ లో నుంచి ఒకటి సెలెక్ట్ చేసి, టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. హేషం అబ్దుల్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. టైటిల్ ను సెట్ చేసిన తరువాత నుంచి ప్రమోషన్స్ మొదలెట్టనున్నారు.