Jagan: మీ స్ఫూర్తి ప్రతిక్షణం నన్ను చేయిపట్టి నడిపిస్తోంది: జగన్ భావోద్వేగం

నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి. ఈ సందర్భంగా ఆయన తనయుడు, సీఎం జగన్ భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, ప్రతి ఇంట్లో గొప్ప చదువులు చదవాలని, సుఖసంతోషాలతో ప్రతి ఒక్కరూ ఉండాలని మీరు నిరంతరం తపించారు నాన్నా... అదే ప్రజలందరి హృదయాల్లో మీ స్థానాన్ని సుస్థిరం చేసిందని చెప్పారు. ఆ ఆశయాల సాధనలో మీ స్ఫూర్తి తనను ప్రతిక్షణం చేయిపట్టి నడిపిస్తోందని అన్నారు. మీ జయంతి తమకందరికీ ఒక పండుగ రోజు అని భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు.
Jagan
YSRCP
YS Rajasekhar Reddy

More Telugu News