రూ. 30కే కిలో టమాటా పంపిణీ చేసిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న
- సొంత డబ్బులతో టమాటాలు కొనుగోలు చేసి పంపిణీ చేసిన బుద్దా వెంకన్న
- పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తామన్న టీడీపీ నేత
- ధరలు దిగివచ్చేంత వరకు పంపిణీ చేస్తామని వెల్లడి
తన సొంత డబ్బులతో టమాటాలు కొనుగోలు చేసిన ఆయన తోపుడుబండిపై తీసుకొచ్చి వన్ టౌన్ రథం సెంటర్‌లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ.. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వలంటీర్లతో ఇంటింటికీ రెండు కిలోల టమాటాలను సబ్సిడీపై పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.