మూత్ర విసర్జన బాధితుడి కాళ్లు కడిగి క్షమాపణలు చెప్పిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి
- మూత్ర విసర్జన ఘటన తనను కలచివేసిందన్న శివరాజ్‌సింగ్
- నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
- ఇంటిని కూల్చేసిన అధికారులు
నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఎస్సీ ఎస్టీ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడి ఇంటిని అధికారులు బుల్డోజర్తో కూల్చివేశారు. బాధిత కూలీని కలవడానికి ముందు సీఎం మాట్లాడుతూ ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. తన హృదయం బాధతో నిండిపోయిందని పేర్కొన్నారు. బాధితుడిని, ఆయన కుటుంబాన్ని భోపాల్‌లో కలవనున్నట్టు చెప్పారు. ఆ తర్వాత దాస్మేష్‌ను కలిసిన సీఎం ఆయన కాళ్లు కడిగి శాలువాతో సత్కరించారు. ఆపై జరిగిన ఘటనకు క్షమాపణలు తెలిపారు.