నిర్మాతగా మారిన బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్
- బ్లూ బటర్ ఫ్లై పేరిట నిర్మాణ సంస్థ ప్రారంభం
- తొలి ప్రాజెక్ట్‌గా ‘దో పట్టి’ సినిమా ప్రకటన
- కాజోల్‌తో కలిసి నటించనున్న కృతి
తన చెల్లి నుపూర్ సనన్ తో కలిసి ‘బ్లూ బటర్ ఫ్లై ఫిల్మ్స్’ పేరుతో నిర్మాణ సంస్థను ప్రకటించింది. ఈ ప్రొడక్షన్ హౌజ్ నుంచి మొదటి ప్రాజెక్ట్‌గా ‘దో పట్టి’ అనే సినిమా తెరకెక్కబోతోంది. నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానున్న ఈ చిత్రం ఓ మిస్టరీ థ్రిల్లర్. ఇందులో కృతి సనన్ హీరోయిన్‌గానూ నటిస్తోంది. సీనియర్ నటి కాజోల్ మరో కీలకపాత్రను పోషిస్తోంది. నిర్మాణ సంస్థను ప్రారంభించాలని తొమిదేళ్లుగా అనుకుంటున్నానని కృతి చెప్పింది. ఎట్టకేలకు తన కలలను సాకారం చేసుకుంటున్నానని తెలిపింది.