సమంత షాకింగ్ నిర్ణయం.. సినిమాలకు లాంగ్ బ్రేక్

Samantha takes long break from movies
  • ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న సమంత
  • ఆరోగ్యంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలనుకుంటున్న సామ్
  • నిర్మాతలకు అడ్వాన్సులు వెనక్కిచ్చిన వైనం
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత షాకింగ్ డెసిషన్ తీసుకుంది. సినిమాల నుంచి లాంగ్ బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఏడాది పాటు సినిమాలు చేయకూడదని డిసైడ్ అయింది. వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండే సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ఆ వ్యాధి నుంచి ఆమె కోలుకుంది. అయితే ఈ ఏడాది బ్రేక్ కాలంలో సమంత తన ఆరోగ్యంపై పూర్తి స్థాయిలో దృష్టిని సారించనుంది. అడిషనల్ ట్రీట్మెంట్ తీసుకోనుంది. 

ప్రస్తుతం 'ఖుషి' సినిమాతో పాటు 'సిటాడెల్' వెబ్ సిరీస్ లో సమంత నటిస్తోంది. విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఖుషి' సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. మరో మూడు రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ముగుస్తోంది. మరోవైపు 'సిటాడెల్' షూటింగ్ కూడా చివరి దశలో ఉంది. ఈ రెండు షూటింగులు పూర్తయిన తర్వాత ఆమె అన్ని కమిట్ మెంట్ల నుంచి ఫ్రీ అవుతుంది. ఇప్పటి వరకైతే టాలీవుడ్ కానీ, బాలీవుడ్ కానీ కొత్తగా ఆమె ఏ ప్రాజెక్టులపై సంతకం చేయలేదు. కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోలేదు. గతంలో తీసుకున్న అడ్వాన్సులను కూడా ఆమె నిర్మాతలకు తిరిగి ఇచ్చేసింది. సమంత సినిమాల నుంచి లాంగ్ బ్రేక్ తీసుకోవడంతో ఆమె అభిమానులు నిరాశకు గురవుతున్నారు. అయితే ఆమె పూర్తి ఆరోగ్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని కోరుకుంటున్నారు.
Advertisement
Samantha
Tollywood
Bollywood
Break
Khushi
Citadel

More Telugu News