మహిళ ప్రాణాలు తీసిన పెంపుడు ఒంటె
- ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రాస్ జిల్లా బస్గోయ్ గ్రామంలో వెలుగుచూసిన ఘటన
- ఆదివారం ఒంటెకు నీళ్లు పెట్టేందుకు వెళ్లగా మహిళ గొంతు నోటపట్టిన ఒంటె
- ఊపిరాడక బాధితురాలి దుర్మరణం
తోతా దేవి, ఆమె భర్త పప్పూ బఘేల్‌తో కలిసి బస్గోయ్ గ్రామంలో నివసిస్తుంటారు. ఆదివారం ఎప్పటిలాగే ఒంటెకు నీళ్లు పెట్టేందుకు వెళ్లగా ఈ దారుణం జరిగింది. ఒంటె నోట చిక్కిన తోతా దేవీ ఆర్తనాదాలు విన్న వెంటనే ఇరుగు పొరుగు అక్కడికి చేరుకోగా అప్పటికే ఆమె మరణించింది.