పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ‘ఉమ్మడి పౌరస్మృతి’
- ఉమ్మడి పౌరస్మృతిపై పట్టుదలగా ఉన్న కేంద్రం
- ఈ సమావేశాల్లోనే టేబుల్‌పైకి ముసాయిదా బిల్లు
- ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడే వారే దానిని వ్యతిరేకిస్తున్నారన్న ప్రధాని
ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారమే స్పష్టం చేశారు. సున్నితమైన అంశాలపై ముస్లింలను రెచ్చగొడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు కూడా దీనిపై సానుకూలంగా ఉందని, కానీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడేవారే దానిని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. ఒకే దేశంలో రెండు విధానాలు ఏంటని ప్రశ్నించారు. కాగా, లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.