Vijay: 'లియో' నుంచి విజయ్ ఫస్టులుక్ పోస్టర్ రిలీజ్!

Leo movie first look poster released
షార్ట్స్‌లో చూడండి
విజయ్ 67వ సినిమాగా రూపొందుతున్న 'లియో' సినిమా అనేక ప్రత్యేకతలను సంతరించుకుంది. ఇంతకుముందు విజయ్ కి 'మాస్టర్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. లలిత్ కుమార్ - జగదీశ్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ఈ సినిమాలో విజయ్ కనిపించనున్నాడు. 

ఈ రోజున విజయ్ బెర్త్ డే .. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఆయన ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. మంచుకొండల నేపథ్యంలో బలమైన సుత్తినే ఆయుధంగా ఉపయోగిస్తూ ఆయన శత్రు సంహారం చేస్తున్నట్టుగా ఈ పోస్టర్ ఉంది. మంచుకొండల నేపథ్యంలో నడిచే కథ ఏమిటి? హీరో ఎందుకు అంత వైలెంట్ గా మారిపోయాడు? అనేది సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. 

విజయ్ - అనిరుధ్ కాంబినేషన్ ఇప్పుడు బాగా పాప్యులర్ అయింది. అందువలన ఈ ఇద్దరూ కలిసి చేయబోయే మ్యూజికల్ ఫీస్ట్ కోసం అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు. బలమైన తారాగణం ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా కనిపిస్తోంది. ఆ జాబితాలో త్రిష .. సంజయ్ దత్ .. అర్జున్ .. ప్రియా ఆనంద్ .. గౌతమ్ మీనన్ .. మన్సూర్ అలీఖాన్ కనిపిస్తున్నారు. అక్టోబర్ 19వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
Go Back to Shorts
Vijay
Trisha
Sanjay Dutt
Leo Movie

More Telugu News